బిగ్‌బాస్: అరియానా.. అవినాష్ ఇద్దరిలో ఒకరికి వేటు తప్పదా?
బిగ్‌బాస్: అరియానా.. అవినాష్ ఇద్దరిలో ఒకరికి వేటు తప్పదా?

అనేక విమర్శలు ఆరోపణలతో కొనసాగతున్న తెలుగు ‘బిగ్‌బాస్’ బాగానే ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఇప్పటికే హౌస్ నుంచి దేవీ నాగవళ్లి సుజాత బయటకు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓటింగ్ పరంగా కాకుండా.. హౌస్‌లో అఫైర్లు నడేపేవాళ్లకు ఎక్స్ఫొజింగ్ చేసేవాళ్లకు మాత్రమే ఉంచుతున్నారని.. బిగ్‌బాస్ ఓటింగ్‌ను అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ఆరోపణల నడమ ఈ వారం కుమార్‌సాయి బయటకొచ్చేశాడు. అయితే సాయి ఎలిమినేషన్‌పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నిజాయితీగా ఆడుతున్న ఓ ఇంటిసభ్యుడిని బలిపశువును చేశారంటూ కామెంట్లు వినిపించాయి.

ఈ వారం ఎవరూ నామినేట్ అయ్యారంటే..
నామినేషన్ల ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ ముగిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏడో వారం ఎలిమినేషన్ కోసం అభిజిత్ నోయల్ సీన్ దివి వాద్యా అవినాష్ మోనాల్ గజ్జర్ అరియానా నామినేట్ అయినట్టు సమాచారం. అయితే వీరిలో హారిక అఖిల్ సోహైల్ మెహబూబ్ లాస్య తదితరులు నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారట. దీంతో అరియానా అవినాశ్ నామినేషన్లో ఉన్నట్టు సమాచారం.

ఈ వారం అసలు ఎలిమినేషనే ఉండదా?

అయితే ఏడోవారం అసలు ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఇంటి సభ్యులకు ఎలిమినేషన్ నుంచి కొంత ఊరట ఇచ్చే ప్రక్రియను తెరపైకి నిర్వాహకులు తీసుకురానున్నట్టు సమాచారం. కానీ ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. మరోవైపు ఈ వారం మోనాల్‌ను ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కు తరలించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here