సింగర్ పై ఎమ్మెల్యే అత్యాచారం .. ఆ తరువాత కొడుకు అల్లుడు కూడా ..
సింగర్ పై ఎమ్మెల్యే అత్యాచారం .. ఆ తరువాత కొడుకు అల్లుడు కూడా ..

యూపీలో వరుసగా అత్యాచార ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తనపై అఘాయిత్యం జరిగిందని ఓ సింగర్ పోలీసులను ఆశ్రయించింది. అయితే తన పై అత్యాచారం చేసింది ఓ ఎమ్మెల్యే అతడి కుమారుడు మేనల్లుడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. భాదిత సింగర్ ఫిర్యాదు మేరకు .. ఎమ్యెల్యే తో సహా మరో ఇద్దరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ మిత్రపక్షమైన నిషద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే  ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రసార మాద్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఈ ఘటన పై పూర్తి వివరాలని చూస్తే .. .. 2014లో ఎమ్మెల్యే  ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల బాధిత గాయనిరి తన ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అతడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అలానే 2015లో వారణాసిలో ఒక హోటల్ లో ఎమ్మెల్యే మరో సారి బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు బధోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. అనంతరం  ఎమ్మెల్యే  ఆమెను ఇంటి దగ్గర వదిలేయమని కొడుకు మేనల్లుడికి చెప్పారని.. అయితే వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

తన మీద ఆ  ఎమ్మెల్యే  అత్యాచారం చేసే సమయంలో అతను వీడియో తీశాడని ఆ వీడియో అడ్డంపెట్టుకుని తన జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడని లేడీ సింగర్ ఆరోపించారు. అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెప్పినా పోలీసు కేసు పెట్టినా నిన్ను చంపేస్తామని నీ కుటుంభాన్ని నాశనం చేస్తామని ఎమ్మెల్యే  బెదరించాడని లేడీ సింగర్ కేసు పెట్టిందని బధోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ మీడియాకు వివరించారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే  పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా గత ఏడాది సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్కు చెందిన భూమిని ఆక్రమించుకున్నారన్న కేసులో అరెస్ట్ అయ్యి  ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో గాయని… ఆయనపై గోపిగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వద్ద నా వీడియో క్లిప్ ఉంది. అందుకే ఆయన మీద అనేక కేసులు ఉన్నప్పటికి ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి నేను భయపడ్డాను అని ప్రస్తుతం అతడు అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడన్న విషయం తెలియడంతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దాదాపు 20 రోజుల క్రితం ఆగ్రా సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. ఆ ఎమ్మెల్యే బీజేపీ మిత్రపక్షమైన నిషద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here