'ఆర్.ఆర్.ఆర్' కోసం అలియా వచ్చేస్తోంది..!
'ఆర్.ఆర్.ఆర్' కోసం అలియా వచ్చేస్తోంది..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించనుంది. అలియా ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించనుంది. ఈ బ్యూటీ ఆర్.ఆర్.ఆర్ సెట్ లో అడుగుపెట్టే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆలియా నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ కి వచ్చి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం. చరణ్ – ఎన్టీఆర్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఆలియా కూడా ఉంటారని తెలుస్తోంది. ముందుగా ఈ సీన్స్ ని పూణే లొకేషన్స్ లో షూట్ చేయడానికి ప్లాన్స్ చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్లాన్ మారిపోయింది. ఇటీవలే హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

కాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అలియా భట్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల రాజమౌళి ఈ వార్తపై స్పందిస్తూ ‘ఆలియా భట్ ఫెంటాస్టిక్ పెర్ఫామర్. మా సినిమాలో చేయాల్సిన క్యారక్టర్ కి తను ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకనే ఆమెను అప్రోచ్ అయ్యాం. తను కూడా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగింది నా సినిమాకి ఎఫెక్ట్ అవుతుందని అనుకోవడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. అలియా భట్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్’ సినిమాలో నటిస్తోంది. అలానే అక్కినేని నాగార్జున – అమితాబ్ బచ్చన్ – రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా అలియా నటిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here