పిక్ టాక్: మాస్ లుక్ లో స్టైలిష్ గా బెల్లంకొండ...!
పిక్ టాక్: మాస్ లుక్ లో స్టైలిష్ గా బెల్లంకొండ...!

‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. సినిమా సినిమాకి ఫిజిక్ లో వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయక’ ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ ‘రాక్షసుడు’ ఇలా ప్రతి సినిమాకి కష్టపడుతూ వచ్చాడు. అయితే కమర్షియల్ ఎంటర్టైనర్లలో నటించినప్పటికీ గెటప్ లో లుక్ లో మాత్రం ఈ యంగ్ హీరో పెద్దగా వేరియేషన్ చూపించలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ”అల్లుడు అదుర్స్” కోసం కంప్లీట్ లుక్ చేంజ్ చేశాడు. ఇప్పుడు ట్రెండ్ గా మారిన పొడవాటి జుట్టు మరియు గడ్డంతో దర్శనమిచ్చాడు మన అల్లుడు శీను.

సోషల్ మీడియాలో ఈ మధ్య డిఫరెంట్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. లేటెస్టుగా మరో న్యూ పిక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనికి ”ఆలోచించడం సులభం.. నటించడం కష్టం.. ఒకరు అనుకున్నట్లుగా వ్యవహరించడం అన్నింటికన్నా చాలా కష్టం” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటోలో గుబురు గడ్డంతో కోరమీసంతో బెల్లంకొండ శ్రీనివాస్ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలానే శ్రీను ధరించిన కాస్ట్యూమ్స్ తో క్లాస్ టచ్ కూడా ఇచ్చాడు. బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.

కాగా ‘రాక్షసుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీనివాస్.. అదే జోష్ లో ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ ని 2021 సంక్రాంతి సీజన్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నభా నటేష్ – అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here