ఫోటో స్టోరి: నాగినిలా షాకిస్తున్న జాన్వీ
ఫోటో స్టోరి: నాగినిలా షాకిస్తున్న జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత జాన్వీ క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. ప్రఖ్యాత దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ భామను హిందీ పరిశ్రమలో తలమానికంగా తీర్చిదిద్దుతున్నారు.

ఇకపోతే జాన్వీ నిరంతరం సోషల్ మీడియాలో ఇచ్చే ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. రెగ్యులర్ గా ఇన్ స్టా లో వేడెక్కించే ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ యువతరంలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ రెడ్ హాట్ ఫోటో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలో జాన్వీ నాగినిని తలపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారంతా. మెరూన్ కలర్ స్లైడ్ టాప్ లో అదరగొట్టేసింది జాన్వీ. పొరవిడిచిన సర్పకన్యవా? అంటూ కుర్రకారు పరేషాన్ అయిపోతున్నారు ఈ ఫోటో ట్రీట్ కి.

ఇక ఇటీవలే జాన్వీ .. తన మాతృమూర్తి శ్రీదేవి ఫోటోని షేర్ చేసి ఎమోషన్ కి గురైంది. శ్రీదేవి అకాల మరణం కపూర్ గాళ్ కి ఎప్పటికీ తీరని లోటు అనే చెప్పాలి. 13 ఆగష్టు 2019 దివంగత శ్రీదేవి 56 వ జయంతిని గుర్తుచేసుకుంది జాన్వీ.  ఆమె కోసం ఒక సాధారణ నోట్ రాసింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు ముమ్మా.. ఐ లవ్ యు“ అంటూ ఎమోషనల్  వ్యాఖ్యను జోడించింది. శ్రీదేవి – బోనీ ఒకరినొకరు కౌగిలించుకుంటూ బీచ్ ముందు పోజులిచ్చిన ఫోటో వైరల్ అయ్యింది. జాన్వీ తదుపరి తఖ్త్ .. దోస్తానా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసినదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here