తను మరోసారి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఈమధ్య కరీనా స్వయంగా ప్రకటించింది. అలా తన ప్రెగ్నెన్సీ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన కరీనా, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెలల గర్భంతో ఉన్న కరీనా ఫొటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రెగ్నెంట్ అయినప్పటికీ మరోవైపు తన వర్క్ మాత్రం ఆపలేదు కరీనా. అక్క కరిష్మా కపూర్ తో కలిసి ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంది. ఆ షూట్ లో తన బేబీ బంప్ (గర్భం)తో కనిపించింది బెబో. దానికి సంబంధించిన స్టిల్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతకంటే ముందు స్వయంగా కరిష్మా కపూర్, దీనికి సంబంధించి ఓ ఫొటో విడుదల చేసింది. షూటింగ్ కోసం రెడీ అవుతున్న కరీనాతో దిగిన ఫొటోను షేర్ చేసింది.

సైఫ్-కరీనా జంటకు ఇప్పటికే ఓ బాబు ఉన్నాడు. వాడి పేరు తైమూర్. ఇప్పుడీ జంట మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోతానంటోంది కరీనా.

మరోవైపు తను గర్భవతినైనప్పటికీ తన ఆహారం, వ్యాయామంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని చెబుతోంది కరీనా. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ తినాలని అంతా అంటుంటారని, తను మాత్రం మితంగానే తింటున్నానని చెబుతోంది.

అయితే పోషకాలన్నీ అందేలా ఆహారం తీసుకుంటున్ననని, మాంసాహారానికి మాత్రం దూరంగా ఉన్నానని చెబుతోంది. తనకు ఎంతో ఇష్టమైన నెయ్యిని మాత్రం ఎక్కువగా తింటోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here