బాలయ్య 'గోన గన్నారెడ్డి' బాధ్యత ఆ దర్శకులకి అప్పగిస్తున్నారా..?
బాలయ్య 'గోన గన్నారెడ్డి' బాధ్యత ఆ దర్శకులకి అప్పగిస్తున్నారా..?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారనే విషయం తెలిసిందే. ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ ‘పాండురంగడు’ ‘శ్రీరామరాజ్యం’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ క్రమంలో కాకతీయుల చరిత్రలో వీరుడిగా పేరుగాంచిన ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో బాలయ్య నటించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన హోమ్ బ్యానర్ లో మరో నిర్మాత సి.కళ్యాణ్ తో కలిసి నిర్మిస్తారని సమాచారం. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనే దానిపై ఫిలిం సర్కిల్స్ లో అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్లో నిలిచిపోయే రెండు చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘గోన గన్నారెడ్డి’ కి దర్శకత్వం వహించనున్నారట. అంతేకాకుండా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఈ సినిమాకు డైలాగ్స్ రాయించాలని బాలయ్య అనుకుంటున్నాడట.

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి BB3 హ్యాట్రిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే బోయపాటి తనదైన యాక్షన్ పంథాలో ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘గోన గన్నారెడ్డి’ ని కూడా బోయపాటి చేతిలో పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమా తీసిన పూరీతో డైలాగ్స్ రాయించాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here