'వకీల్ సాబ్' థియేట్రికల్ బిజినెస్ ఎక్కడిదాకా వచ్చింది..!
'వకీల్ సాబ్' థియేట్రికల్ బిజినెస్ ఎక్కడిదాకా వచ్చింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ తీసుకొని నటిస్తున్న సినిమా ”వకీల్ సాబ్”. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. బోనీ కపూర్ సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ లేకపోయుంటే సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేవారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ చిత్రానికి ఓటీటీల నుంచి భారీగా ఆఫర్స్ వచ్చినా దిల్ రాజు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం.

అయితే మన రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ బిజినెస్ కి ఎలాంటి ఢోకా ఉండదు. పవన్ కళ్యాణ్ ఎన్నేళ్ల గ్యాప్ తీసుకుని నటించినా.. ప్లాపుల్లో ఉన్నా బిజినెస్ పరంగా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపిస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే ఈసారి ఓవర్సీస్ బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదని తెలుస్తుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ పై బాగా దెబ్బ పడింది. ఎప్పటిలా థియేటర్స్ కి ఓవర్ సీస్ ఆడియెన్స్ ఇలాంటి పరిస్థితుల్లో టిక్కెట్స్ కొని మరీ సినిమాలు చూడటానికి వస్తారా అన్నది అనుమానమే. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల్లో పెద్ద సినిమా ఇదే అని చెప్పవచ్చు. అయితే ‘వకీల్ సాబ్’ ఓవర్సీస్ బిజినెస్ పై ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. మరి త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.

కాగా పవన్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ పై అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ – అంజలి – నివేదా థామస్ – అనన్య – ప్రకాష్ రాజ్ – నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. అలానే మోషన్ పోస్టర్ కూడా అంచనాలను అందుకుంది. ‘వకీల్ సాబ్’ విడుదల విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here