ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనుకటికి ఒకతను.. ఇప్పుడు తమిళనాట కమల్ హాసన్ చేసిన ట్వీట్ చూశాక కూడా సోషల్ మీడియాలో కొందరు దెప్పిపొడుస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ బొక్క బోర్లా పడింది. ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. దారుణ పరాభవం.అయినా కూడా కమల్ లో ఆశ చావకపోవడం విశేషమేనని పలువరు కౌంటర్లు వేస్తున్నారు.

ప్రముఖ నటుడు. మక్కల్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ 66 వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఎంతో అభిమానులు పలువురు సినీ ప్రముఖులు కూడా కమల్ కు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. తనకు విషెస్ చెప్పినవారందరికీ కమల్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది వైరల్ గా మారింది. `నాకు విషెస్ చెప్పిన అభిమానులకు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. మీ అందరి శుభాకాంక్షలూ నా పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చాయి. నా పుట్టిన రోజు నాడు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న `మక్కల్ నీది మయ్యం` కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ కష్టానికి ప్రేమకు తగ్గ ఫలితం దక్కేందుకు కష్టపడతా. నా తదుపరి పుట్టినరోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ (తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం)లో జరుపుకుందామ`ని కమల్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఆయన ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తలకు జోష్ నింపగా.. తమిళ పాలిటిక్స్ ను అవపోసన పట్టిన వారు మాత్రం కమల్ సీఎం కావడం అంత ఈజీ కాదని.. ఈసారి అక్కడ స్టాలిన్ హవా కొనసాగుతుందని.. పార్లమెంట్ ఫలితాలే పునరావృతం అవుతాయని అంటున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం సమీకరణాలు మారుతాయంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here