లుక్ టెస్ట్.. బాలయ్యకు అవన్నీ శుద్ధ దండగ
లుక్ టెస్ట్.. బాలయ్యకు అవన్నీ శుద్ధ దండగ

సినిమాలో పోషించబోయే పాత్ర కోసం హీరోలపై లుక్ టెస్ట్ చేస్తుంటారు. హీరోలపైనే కాదు, కొన్ని సందర్భాల్లో హీరోహీరోయిన్లపై కూడా ఈ లుక్ టెస్ట్ చేస్తారు.

తెరపై ఆ జంట ఎలా కనిపిస్తుంది.. ఇద్దరికి మ్యాచింగ్ కుదిరిందా లేదా అనే విషయాల్ని చూస్తారు. అయితే బాలయ్య విషయానికొచ్చేసరికి మాత్రం ఇవన్నీ బలాదూర్. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఎంపిక విషయంలో బాలయ్య సెలక్షన్ నభూతో అన్నట్టు ఉంటుంది..

బాలయ్య ఏజ్-ఫిజిక్ కు, ఈయన సరసన నటించే హీరోయిన్ లుక్ కు ఏమాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు బాలయ్య-లైలా కాంబినేషనే తీసుకుంటే, అప్పట్లో ఈ పెయిర్ పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆ విమర్శల్ని బాలయ్య అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పటికీ పట్టించుకోవట్లేదు.

ఆ తర్వాత తన సినిమాల్లో స్నేహా ఉల్లాల్, షీలా, అంకిత, ప్రీతి జింగ్యానీ లాంటి ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు. ఈ పెయిర్స్ ఏవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. పైపెచ్చు చాలామంది నవ్వుకున్నారు కూడా. బాలయ్య గెటప్ కు, హీరోయిన్స్ బబ్లీ లుక్స్ కు తాత-మనవరాలుకు ఉన్నంత వ్యత్యాసం ఉందని కామెంట్స్ చేశారు.

ఈమధ్య కాలంలో రాధికా ఆప్టే, నయనతార, అనుష్క, శ్రియ లాంటి హీరోయిన్లను తీసుకొని ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నాడు బాలయ్య. అయితే తన కొత్త సినిమాతో మరోసారి తన ఓల్డ్ స్టయిల్ ను రిపీట్ చేశాడు ఈ సీనియర్ నటుడు.

బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం సాయేషా సైగల్ ను తీసుకున్నారు. చిన్న పిల్లలా కనిపించే సాయేషాను, విగ్గు పెట్టుకొని రౌద్రంగా కనిపించే బాలయ్య సరసన ఊహించుకోవడం కాస్త కష్టమే. బహుశా మేకర్స్ కు, వాళ్లకున్న బడ్జెట్ పరిమితుల్లో మరో ఆప్షన్ దొరకలేదేమో.

నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా ప్రయాగ మార్టిన్ అనే మలయాళీ ముద్దుగుమ్మను తీసుకున్నారు. ఆమె హైట్, పర్సనాలిటీ బాలయ్యకు సూటయ్యేలా ఉంది.

కానీ ఏం జరిగిందో ఏమో, ఒక రోజు షూట్ చేసిన తర్వాత ఆమెను తప్పించి, ఆ స్థానంలో సాయేషాను తీసుకున్నారు. మొత్తమ్మీద ఎవ్వరూ ఊహించని హీరోయిన్లకు బాలయ్య ఛాన్సులు ఇస్తారనే విషయం, తాజా సెలక్షన్ తో మరోసారి రుజువైంది. ఇక తెరపై చూసి తరించాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here