మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం.. ధర రూ.7 వేల లోపే!
మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం.. ధర రూ.7 వేల లోపే!

మైక్రోమ్యాక్స్ ఈమధ్యే లాంచ్ చేసిన ఇన్ 1బీ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు(నవంబర్ 10) మధ్యాహ్నం 12 గంటలకు ఇవి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ట్వీటర్ ద్వారా తెలిపింది. ఫ్లిప్ కార్ట్‌లో దీన్ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. మైక్రోమ్యాక్స్ నోట్ 1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో నవంబర్ 3వ తేదీన లాంచ్ అయ్యాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీలో రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని సేల్ ఫ్లిప్ కార్ట్‌లో నవంబర్ 26వ తేదీ నుంచి జరగనుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది. అయితే ప్రీ-ఆర్డర్లు మాత్రం కాస్త ముందుగా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.

మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే ఇందులో అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ పనిచేయనుంది. ఇందులో ఎటువంటి బ్లోట్‌వేర్‌ని మైక్రోమ్యాక్స్ అందించలేదు. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here