యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మరియు సాహో సినిమాలతో ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ లో ఆల్ ఇండియా టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్న ప్రశాంత్ నీల్ తో సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ వద్ద కు మన హీరోల పీఆర్ లు వెళ్లి సినిమా చేసేందుకు సిద్దం అన్నట్లుగా మెసేజ్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

ప్రభాస్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా వస్తే అది బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాకు డబుల్ క్రేజ్ ను కలిగి ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు. ప్రభాస్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కాని తాజాగా ప్రభాస్ సన్నిహితుల నుండి ఒకరు ఆ విషయమై అనధికారికంగా స్పందిస్తూ ఇప్పట్లో ప్రభాస్ వద్ద కేజీఎఫ్ డైరెక్టర్ తో పని చేసేందుకు టైమ్ లేదు అన్నాడు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కాని.. రానున్న రెండు సంవత్సరాల్లో మాత్రం ప్రభాస్ కేజీఎఫ్ ఖచ్చితంగా ఉండదు అన్నట్లుగా ఆయన చెప్పాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ సినిమాను కూడా చేయబోతున్నాడు. 2022లో వరకు ఈ సినిమాలతోనే బిజీ బిజీగా ప్రభాస్ గడుపబోతున్నాడు. ఈ విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కొత్త సినిమాలు ఏమైనా మొదలు అవ్వాలంటే 2022 చివరి వరకు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here