మెగా కోడలి వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా రష్మిక..!
మెగా కోడలి వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా రష్మిక..!

మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ (URLife.co.in) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్న ఈ వెబ్ పోర్టల్ కి దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఇందులో భాగంగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా గెస్ట్ ఎడిటర్ గా కనిపించనున్నారు. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను.. పోషకాహార తయారీ వివరాలను రష్మిక పంచుకోనున్నారు.

కాగా యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ గెస్ట్ ఎడిటర్ గా రష్మిక మందన్న తనకు తెలిసిన హెల్త్ టిప్స్ అందించనుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నుంచి ఆరోగ్యం మరియు సంరక్షణ కోసం ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా పోషకాహారం మరియు ఆరోగ్యానికి సంబంధించిన వర్కౌట్స్ వంటి వెల్ నెస్ కాంపైన్ చేపడుతున్నారు. రష్మిక మందన్న అతిథి సంపాదకురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా ఆమె ఫోటో షూట్ చేసింది. రష్మిక ఈ ఫోటోలలో ఎల్లో కలర్ ట్రెండీ అవుట్ ఫిట్స్ తో చేతిలో లెమన్ పట్టుకొని రకరకాల ఫోజులు ఇచ్చింది. ఇక సినిమాల సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలానే శర్వానంద్ తో కలిసి ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here