కరోనా టైంలో ఏపీ సేఫ్.. 56 లక్షల మంది వెనక్కి, బాప్ రే.. నిజమా? ‘సుత్తి’నా?
కరోనా టైంలో ఏపీ సేఫ్.. 56 లక్షల మంది వెనక్కి, బాప్ రే.. నిజమా? ‘సుత్తి’నా?

53,724 సోమవారం నాటితో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల మొత్తం సంఖ్య ఇది. గత 24 గంటల్లో 4, 074 మందికి కరోనా సోకింది. ఒక్కరోజులో 54 మంది చనిపోయి ఈ వైరస్ డేంజర్ బెల్ మోగించగా.. మొత్తం మరణాల సంఖ్య 696కు చేరింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 1,086 కేసులు నమోదు కావడంతో.. అక్కడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీ పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. సోమవారం నాడు 1198 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ 46, 274 కేసులు నమోదు అయ్యాయి. అయితే తెలంగాణలో కంటే ఏపీలో కోవిడ్ పరీక్షలు ఎక్కువ స్థాయిలో నిర్వహిస్తుండటం వ్యాధి వ్యాప్తిని చాలా వరకూ అరికట్టగలుగుతున్నారు.

మొత్తానికైతే ఏపీలో కరోనా టెర్రర్‌తో ఆందోళనకు గురౌతుంటే.. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితం అని ఏకంగా 56 లక్షల మంది వెనక్కి వచ్చేశారట అని బాంబ్ పేల్చాడు ప్రముఖ సినీ, రాజకీయ విశ్లేషకుడు, మూవీ క్రిటిక్ మహేష్ కత్తి.

గిల్లుకుపోవడం. అల్లుకుపోవడం రేండూ ట్యాలెంట్లే. ఎవరి దారి వారిది. ఈ గిల్లుడు-అల్లుడులో వర్మ రహదారి అయితే నేను కూడా అదే టైపు అంటుంటాడు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ఎవర్నొకర్ని గిల్లడంలో వర్మను ఫాలో అయిపోయే మహేష్ కత్తి పవన్ కళ్యాణ్‌ని ఆయన ఫ్యాన్స్‌ని గిల్లడంలో గోళ్లకి ‘కత్తు’లు కట్టుకుని గిల్లేందుకు రెడీగా ఉంటాడు. తాజాగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమాతో పవన్‌ని గిల్లుతూ సంచలన పోస్టర్స్, పాటలు, ట్రైలర్స్‌తో రచ్చ రేపుతుండగా.. ఆయనకు తోడుగా ఈ ‘పవర్ స్టార్’ తెగ ప్రమోట్ చేస్తూ వరుస పోస్ట్‌లు పెడుతున్న కత్తి మహేష్ తాజాగా ఏపీలో కరోనా పరిస్థితిపై పెట్టిన కామెంట్ ఆసక్తికలిగిస్తోంది.

దాదాపు 56 లక్షల మంది కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ సేఫ్ అని వెనక్కి వచ్చేసారంట… అంటూ మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టడంతో.. ఔనా!! నిజమా ఇది నిజమేనా కత్తీ.. లేకుండా ఇది సుత్తా అని నెటిజన్లు అడుగుతుంటే అవును నిజమే.. ఇతర రాష్ట్రాల పనిచేసే దాదాపు 56 లక్షల మంది ఏపీ అయితే సేఫ్ అని వెనక్కి వచ్చేశారంటూ సందేహం వ్యక్తం చేసేవారికి క్లారిటీ ఇస్తున్నాడు కత్తి మహేష్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here