దీపావళి వేడుకలు ..చైనాకి 40 వేల కోట్ల నష్టం!
దీపావళి వేడుకలు ..చైనాకి 40 వేల కోట్ల నష్టం!

లోకల్ ఫర్ వోకల్ లోకల్ ఫర్ దీవాళి అంటూ దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చినట్లు రికార్డు స్థాయిలో జరిగిన అమ్మకాలని చూస్తే అర్థమౌతుంది. అలాగే చైనా ఉత్పత్తులను నిషేధించండి అన్న నినాదం కూడా దేశంలో బాగా పనిచేస్తోంది. దేశ ప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. దేశంలోని ప్రధాన మార్కెట్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్ జరిగిందని దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

దేశంలో ప్రముఖ పంపిణీ కేంద్రాలుగా ఉన్న 20 నగరాల డేటా ప్రకారం దీపావళి పండుగ అమ్మకాల టర్నోవర్ రూ. 72 వేల కోట్లుగా ఉన్నట్టు సీఏఐటీ వెల్లడించింది. అమ్మకాలకు సంబంధించిన సర్వేలో భాగంగా ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా నాగ్ పూర్ రాజ్ పూర్ భువనేశ్వరో రాంచీ భోపాల్ లక్నో కాన్పూర్ నోయిడా జమ్మూ అహ్మదాబాద్ సూరత్ కొచిన్ జైపూర్ చండీఘడ్ నగరాల డేటాను సీఏఐటీ తీసుకుంది. వాణిజ్య మార్కెట్ లో ఈ అమ్మకాలు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను సూచిస్తాయని తెలిపింది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వంట సామాగ్రి ఫర్నీచర్ వాల్హ్యాంగింగ్స్ బంగారం ఆభరణాలు ఫుట్వేర్ వాచ్లు దుస్తులు ఇంటి అలకంరణ సామాగ్రి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ గిఫ్ట్ ఐటెంలు స్వీట్లు తదితర వస్తువలు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది.

కాగా.. భారత్ చైనా సరిహద్దుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ సీఏఐటీ కేంద్రానికి ప్రజలకు పిలుపునిచ్చింది. ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్ టాక్ వీచాట్ తదితర చైనీస్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో డ్రాగన్ కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here