బీహార్ కేబినెట్: ఆట నితీష్.. ఆడించేంది బీజేపీ
బీహార్ కేబినెట్: ఆట నితీష్.. ఆడించేంది బీజేపీ

బీహార్ కేబినెట్ లో ఎవరెన్ని అనేది లెక్కతేలింది. సీఎంగా నితీష్ ఉన్నా మొత్తం నడిపించేది బీజేపీ అని తేటతెల్లమైంది. బీహార్ ముఖ్యమంత్రిగా స్టీరింగ్ మాత్రమే నితీష్ చేతిలో కంట్రోల్ మొత్తం బీజేపీ తీసేసుకుంది. ఆట నితీష్ ది.. ఆడించేది బీజేపీదని అర్థమైంది.

బీహార్ సీఎంగా నితీష్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నిర్వహించిన సభలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఎన్నుకున్నారు. బీజేపీ కంటే జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా కానీ మిత్రధర్మం ప్రకారం నితీష్ కే సీఎం పగ్గాలు అప్పగించారు.

అయితే డిప్యూటీ సీఎం కీలక శాఖలు సహా స్పీకర్ పదవులను బీజేపీ చేజిక్కించుకోవడం విశేషం. ఈసారి ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులు కట్టబెట్టారు.

ప్రస్తుత డిప్యూటీ సీఎం బీజేపీ బీహార్ అధ్యక్షుడు సుశీల్ మోదీకి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. బీజేపీ నేతలు నితీష్ ఆదివారం రాత్రి సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.

బీహార్ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ ఎమ్మెల్యే తారాకిశోర్ ప్రసాద్ రేణూ దేవిల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కిశోర్ ప్రసాద్ ను నియమించనున్నారని ప్రచారం సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here