మిడిల్ క్లాస్ వారికి మోడీ సర్కార్ తీపికబురు..ఏంటంటే?
మిడిల్ క్లాస్ వారికి మోడీ సర్కార్ తీపికబురు..ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతికి తీపికబురు అందించేందుకు సిద్ధమౌతోంది. మరీముఖ్యంగా ఒక స్కీమ్ డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి బెనిఫిట్ కలగించాలని యోచిస్తోంది. వీరికి పన్ను మినహాయింపు ప్రయోజనం కలుగనుంది. వచ్చే బడ్జెట్ లో మోదీ సర్కార్ ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ PFRDA చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్ మాట్లాడుతూ.. పీఎఫ్ ఆర్ డీఏ ఎన్ పీఎస్ కు సంబంధించి అందరికీ పన్ను మినహాయింపు కల్పించాలనే ప్రాతిపాదన చేస్తుందని తెలిపారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS స్కీమ్ కు సంబంధించి కంపెనీ కంట్రిబ్యూషన్ కు ఇది వర్తిస్తుంది. ఎన్ పీఎస్ అకౌంట్ కు కంపెనీ 14 శాతం కంట్రిబ్యూషన్ పై పన్ను మినహాయింపు అందించాలనే ప్రతిపాదన చేస్తామని ఈయన తెలిపారు. వచ్చే బడ్జెట్ లో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంటుందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తోంది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్ పీఎస్ ఖాతాల కంపెనీ కంట్రిబూషన్ కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కంపెనీకి పన్ను మినహాయింపు కల్పించాలని కేంద్రానికి తెలియజేస్తామని బంద్యోపాద్యా్య తెలిపారు.
ఇప్పటికే పలు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని కోరుతున్నాయి. అంతేకాకుండా ఎన్ పీఎస్ టైర్ 2 అకౌంట్ కు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని పీఎఫ్ ఆర్ డీఏ కోరనుంది. ఇటీవలనే ఈ బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చింది. ఇదే బెనిఫిట్ ను ప్రతి ఒక్క సబ్ స్క్రైబర్ కు అందించాలని పీఎఫ్ ఆర్ డీఏ భావిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here