పవన్ క్లీన్ షేవ్.. షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడా?
పవన్ క్లీన్ షేవ్.. షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడా?

పవన్ కళ్యాణ్ కాస్త విభిన్నమైన గెటప్ లో కనిపిస్తే సోషల్ మీడియాలో చర్చ మొదలు. పవన్ క్లీన్ షేవ్ తో కనిపించినా.. గడ్డంతో కనిపించినా.. బారు గడ్డంతో కెమెరా ముందుకు వచ్చినా ఇలా ప్రతి దానికి కూడా సోషల్ మీడియాలో చాంతాడంత విశ్లేషణలు వస్తూ ఉంటాయి. మొన్నటి వరకు రఫ్ లుక్ లో కాస్త గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ మీటింగ్ సందర్బంగా క్లీన్ షేవ్ తో కనిపించాడు. ఉన్నట్లుండి పవన్ క్లీన్ షేవ్ తో కనిపించడం వెనుక కారణం ఏంటా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

వకీల్ సాబ్ సినిమా కోసం రఫ్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపించాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దాంతో ఎన్నికల్లో పోటీకి సిద్దం అంటూ జనసేన ప్రకటించింది. ఎన్నికల హడావుడి నేపథ్యంలో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని.. అందుకే పవన్ ఇలా నీట్ షేవ్ తో కనిపించాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొత్తానికి పవన్ క్లీన్ షేవ్ లో కనిపించడంతో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది దర్శకుడు లేదా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు. వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ మూవీలో చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం పవన్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాల్సి ఉంది. ఆ సినిమా ఇంకా చాలా రోజులే ఉంది కనుక ఇప్పటి నుండే క్లీన్ షేవ్ లో ఉండటం కుదరదు. అందుకే ఇది క్రిష్ మూవీ కోసం కాదు అనేది కొందరి వాదన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here