చీరలో ఆమె అందం మతి చెడగొడుతోందిగా
చీరలో ఆమె అందం మతి చెడగొడుతోందిగా

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డిస్కవరీ ఫాతిమా సనా షేక్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ అమ్మడి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అభిమానుల్ని ఇప్పటికీ షాక్ లోనే ఉంచాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సనా షాకిచ్చే సంగతి చెప్పింది. తాను కేవలం మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించారు. సినీ పరిశ్రమతో సంబంధాలు లేని వ్యక్తిగా ఈ రంగంలో పోరాడటం గురించి మాట్లాడుతూ సెక్సిజం అనేది అన్నిచోట్లా ఉందని వ్యాఖ్యానించారు. కమిట్ మెంట్ ఫేవరిజం ద్వారా మాత్రమే చిత్ర పరిశ్రమలో అవకాశాలొస్తాయని ప్రకటించి సనా షేక్ షాకిచ్చింది. అంతేకాదు.. నేను మూడేళ్ల వయసులో ఐదేళ్ళ వయసులో కూడా వేధింపులకు గురయ్యానని అన్నారు.

సెక్సిజం అనేది నిరంతరం ఉండేదే. ఒక యుద్ధంలా దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు సనా. ఉద్యోగం సంపాదించడానికి ఏకైక మార్గం సెక్స్ అని జనం నాకు చెప్పారు. దానిని నేను ఎదుర్కొన్నాను. అంగీకరించని కారణం చేత నేను వేరొకరికి అవకాశాల్ని కోల్పోయాను. కానీ పరిశ్రమలో చాలా పోరాడాల్సి ఉందని నేను భావిస్తున్నాను అని సనా వ్యాఖ్యానించింది.

ఫాతిమా సనా షేక్ 1997 లో చైల్డ్ ఆర్టిస్ట్గా తన వృత్తిని ప్రారంభించింది – ఆమె `చాచి 420` లో కమల్ హాసన్ కుమార్తె పాత్రలో నటించింది. అమీర్ ఖాన్- సన్యా మల్హోత్రాతో కలిసి నటించిన 2016 రెజ్లింగ్ డ్రామా దంగల్తో ఆమె ప్రధాన నటిగా బాలీవుడ్ లోకి ప్రవేశించింది. . 2018 లో ఫాతిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ అనే ఫిక్షన్ డ్రామాలో నటించింది. ఇందులో ఆమె అమీర్ ఖాన్ తో మరోసారి స్క్రీన్ స్పేస్ ని పంచుకుంది. అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో నటించారు.

ఫాతిమా సనా షేక్ తదుపరి నెట్ఫ్లిక్స్ మూవీ లూడో ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. సమిష్టి తారాగణం కృషితో సిరీస్ విజయం సాధించింది. తన లైనప్ లో `సూరజ్ పె మంగల్ భారీ` రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా సనాషేక్ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సనా స్టన్నింగ్ బ్యూటీ చీరలో ఎలివేట్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here