మంచు విష్ణు- వైట్ల కలయికలో క్రేజీ ఎంటర్ టైనర్
మంచు విష్ణు- వైట్ల కలయికలో క్రేజీ ఎంటర్ టైనర్

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామెడీ యాక్షన్ డ్రామాల్లో ట్రెండ్ సెట్టర్ మూవీ ఇది. ఈ సినిమాకి పని చేసిన మొత్తం తారాగణం సిబ్బందికి కెరీర్ పరంగా గేమ్ ఛేంజర్ గా ఛాన్సిచ్చిన మూవీ ఇది. దర్శకుడు శ్రీను వైట్ల స్టార్ హీరోలతో వరుస ఆఫర్లను అందుకున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ల కేటగిరీలో విష్ణు క్రేజీ హీరోగా నిలిచాడు.

13 సంవత్సరాల తరువాత ఢీ కాంబో మరో ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనర్ తో తిరిగి వచ్చింది. అవును.. విష్ణు మంచు – శ్రీను వైట్ల ఒక చిత్రం కోసం చేతులు కలిపారు. దీనికి సంబంధించిన నవంబర్ 13 న విష్ణు పుట్టినరోజు సందర్భంగా లుక్ లాంచ్ చేయనున్నారు.

సినీ ప్రేమికుల్లో ఒక ఫేవ్ తెచ్చిన సినిమాలలో ఢీ ఒకటి గా నిలిచింది. ఆ సీజన్ లో సరికొత్త సినిమాల వెల్లువకు కారణమైంది. ఢీ కంటే ఏది మంచిది? అంటూ విష్ణు మంచు ప్రకటించారు. వైట్లతో రీయూనియన్ విషయమై విష్ణు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here