సీకే బ్యూటీ .. చలికాలంలో సమ్మర్ మంటలు
సీకే బ్యూటీ .. చలికాలంలో సమ్మర్ మంటలు

దిశా పటాని.. ఈ పేరు పరిచయం చేయాల్సిన పనే లేదు. లోఫర్ బ్యూటీగా.. టైగర్ ష్రాఫ్ మాజీ ప్రేయసిగా తెలుగు అభిమానులకు సుపరిచితం. అంతకుమించి సోషల్ మీడియా క్వీన్ గానూ పరిచయమే. చలికాలంలో మండుటెండల్ని పరిచయం చేయడం ఈ అమ్మడి ప్రత్యేకత.

తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ వేదికగా లేటెస్ట్ బికినీ ఫోటోని షేర్ చేసింది. బికినీ బీచ్ లో సీకే బ్యూటీ ఫుల్ కిక్కులో ఉంది. ఈ ఫోటోలో సియాన్ కలర్ బికినీ స్విమ్ సూట్ ధరించి హీటెక్కిస్తోంది. మాల్దీవుల సెలబ్రేషన్ నుంచి స్నాప్ ఇది. ఆమె దానిని పూల ఎమోజీలతో షేర్ చేసింది. దిశా ఎక్స్ బాయ్ ఫ్రెండ్.. టైగర్ ష్రాఫ్ ఆ ఫోటోకి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ దిశాకు `ఒక ప్రేరణ` అని వ్యాఖ్యను జోడించారు. ఇక అభిమానులైతే సీకే బ్యూటీ చలికాలంలో సమ్మర్ మంటలు పెడుతోంది! అంటూ ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారు.

అంతకుముందు దిశా తన అభిమానులకు బీచ్ వెకేషన్ పేరుతో బోలెడంత బికినీ ట్రీటిచ్చింది. రకరకాల భంగిమల్లో షేక్ చేసే చిత్రాలను పంచుకుంది. ఎర్ర బికినీ ధరించిన రెండు వేడెక్కించే ఫోటోల్ని దిశా పంచుకుంది.

టైగర్ – దిషా 2016 నుండి రిలేషన్ షిప్ ఉందని ధృవీకరించినా ఆ తర్వాత బ్రేకప్ అయ్యారు. బెఫికర్ మ్యూజిక్ వీడియో సెట్ లో టైగర్ ప్రేయసి దిశాను కొట్టారని.. అటుపై ఆ ఇద్దరూ ఒకరినుంచి ఒకరు స్పష్టంగా విడిపోయి చివరికి దూరమయ్యారని ప్రచారమైంది.

బాఘీ 2 లో కలిసి పనిచేసిన దిషా -టైగర్ తరచుగా ముంబై ఔటర్ లో రకరకాల వేదికలపై కనిపిస్తుంటారు. విడిపోయాకా ఈ జంట కలిసే స్నేహంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టైగర్ సోదరి కృష్ణ అతని తల్లి ఆయేషా ష్రాఫ్ లతో దిశా మంచి సంబంధాన్ని కలిగి ఉందని చెబుతుంటారు. వారు తరచుగా డిన్నర్ లు లంచ్ లు అంటూ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

కెరీర్ సంగతి చూస్తే.. దిశా తదుపరి `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` లో కనిపిస్తుంది. కాగా టైగర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో `గణపత్` లో నటిస్తున్నారు. ఇందులో బాక్సర్ పాత్రలో టైగర్ కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here