అప్పుడు కొడుకుతో ఇప్పుడు తండ్రితో ఢీ
అప్పుడు కొడుకుతో ఇప్పుడు తండ్రితో ఢీ

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు అరవింద్ స్వామి. ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈయన చరణ్ తో ధృవ సినిమాలో నటించిన సమయంలో మంచి ఆధరణ లభించింది. చరణ్ మరియు అరవింద్ స్వామిల కాంబోకు మంచి పేరు దక్కింది. స్టైలిష్ విలన్ గా ఈ తమిళ స్టార్ నటుడు పేరు దక్కించుకున్నాడు. అందుకు ఆచార్య సినిమాలో ఈయన్ను కీలక పాత్రలో నటింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఆచార్య లో సోనూసూద్ తో పాటు మరో కీలకమైన విలన్ పాత్రకు గాను అరవింద్ స్వామిని సంప్రదించారట. తక్కువ డేట్లు కోరడం వల్ల ఆచార్యరకు ఆయన ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు లేదా రేపటి నుండి చిరంజీవి ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. వచ్చే నెలలో అరవింద్ స్వామి షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here