బిగ్ బాస్ చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు ... ఎక్కడంటే ?
బిగ్ బాస్ చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు ... ఎక్కడంటే ?

బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో .. ఈ షో ప్రస్తుతం తెలుగులో 4 వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ షో కి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ బిగ్ బాస్ షో మరో విధంగా కూడా ఉపయోగపడింది. ఓ వ్యక్తికి వైద్యులు బిగ్ బాస్ షో ను చూపిస్తూ బ్రెయిన్ కి ఆపరేషన్ చేసేశారు. ఈ ఘనత చేసింది ఏపీ డాక్టర్లు కావడం మరో విశేషం. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టం. కానీ ప్రస్తుత రోజుల్లో ఆపరేషన్ అన్నం తిన్నంత సేపటిలో చేసేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని డాక్టర్లు ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. ఆ పేషెంట్ ఆపరేషన్ చేసే సమంలో ఎంత ఖుషీగా ఉన్నాడంటే..డాక్టర్లు ఆ పేషెంట్ కు బిగ్ బాస్ షో అవతార్ సినిమాను చూపిస్తూ అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 2016లో హైదరాబాద్ లోనే సర్జరీ చేసి కణితిని తొలగించి.. రేడియేషన్ ఇచ్చారు. మళ్లీ కొన్ని నెలల నుంచి ఆయనకు తరచుగా ఫిట్స్ వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో కణితి మళ్లీ పెరిగినట్లు గుర్తించారు. దీనితో మళ్లీ సర్జరీ చేసి తొలగించాలని నిర్ణయించారు.దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంది.

అయితే..మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో సీనియర్ న్యూరాలజిస్టులు అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి మాట్లాడిస్తూ.. టీవీలో బిగ్బాస్ షో అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రోగి వరప్రసాద్కు ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారు కావడం గమనించాల్సిన విషయం. వరప్రసాద్ పూర్తిగా కోలుకోవడంతో నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే ఈ ఆపరేషన్ కి గాను వరప్రసాద్ ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టలేదు. అతనికి భీమా ఉంది. ఈ ఆపరేషన్ గంటన్నర సమయం పట్టిందని..ఈ ఆపరేషన్ లో తనతో పాటుగా సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ డి.శేషాద్రిశేఖర్ మత్తు వైద్యనిపుణుడు డాక్టర్ బి.త్రినాథ్ పాల్గొన్నారని న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవేక్ బ్రెయిన్ సర్జరీ తామే మొట్టమొదటిసారిగా చేశామని వెల్లడించారు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here