లవ్ జీహాద్ కేసులో యూపీ సర్కార్ కి బిగ్ షాక్ ... ఏమైందంటే ?
లవ్ జీహాద్ కేసులో యూపీ సర్కార్ కి బిగ్ షాక్ ... ఏమైందంటే ?

యూపీ లో లవ్ జీహాద్ పేరుతో విదేశీ కుట్ర జరుగుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నా యూపీ లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్ సర్కార్ కి బిగ్ షాక్ . లవ్ జిహాద్ పేరుతో యువతులను వల వేస్తూ విదేశీ ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపిస్తున్న ప్రభుత్వం తాజాగా కాన్పూర్ ఘటనలపై సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్రా జరగలేదని వెల్లడైంది. కాన్పూర్ లో సిట్ లవ్ జిహాద్ పేరుతో జరిగిన 14 ఘటనలను గుర్తించింది. ఇందులో 11 ఘటనల్లో ఎలాంటి నేరపూరిత కుట్ర కానీ విదేశీ హస్తం కానీ ఉన్నట్లు తమకు ఆధారాలు లభించలేదని సిట్ తాజాగా తెలిపింది.

దీంతో లవ్ జిహాద్ పేరుతో విదేశీ కుట్ర జరుగుతున్నట్లు యోగీ సర్కారు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవాలు అని తెలుస్తుంది. బీజేపీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఆరెస్సెస్ వీహెచ్ పీ వంటి సంస్ధలు కొందరు ముస్లిం యువకులు హిందూ యువతులను లొంగ దీసుకోవడాన్ని లవ్ జిహాద్ గా చెప్తూ కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇదేం నేరం కాదని ప్రభుత్వం పై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. సిట్ దర్యాప్తు చేసిన 14 కేసుల్లో యువతుల తల్లితండ్రులు ముస్లిం యువకులు తమ పిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించినట్లు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు.

ఇందులో ప్రమేయమున్న యువకులు అంతా కలిసి వ్యవస్ధీకృతంగా పనిచేశారని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని సిట్ తేల్చినట్లు ఆయన వెల్లడించారు. అలాగే విదేశాల నుంచి వీరికి నిధులు అందినట్లు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కేవలం నిందితులుగా ఉన్న యువకులు తమ పేర్లు మార్చుకుని యువతులను పెళ్లి చేసుకున్నట్లు మాత్రమే తేలింది. ఇలా పేర్లు మార్చుకొని పెళ్లి చేసుకున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అలాగే మిగిలిన మూడు కేసుల్లో మేజర్లుగా ఉన్న యువతులు తమ ఇష్టంతోనే వారిని పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణ అయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here