హిందూ .ముస్లిం పెళ్లి పై హైకోర్టు కీలక తీర్పు
హిందూ .ముస్లిం పెళ్లి పై హైకోర్టు కీలక తీర్పు

పెళ్లి … ఎవరి జీవితంలో అయినా కూడా ఓ మధురమైన అనుభూతి. ఆ అనుభూతి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కలలు కంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. నచ్చిన వారిని ప్రేమించి ఇంట్లో వారిని ఒప్పించి కొంతమంది పెళ్లి చేసుకుంటుంటే మరికొంతమంది తమ ప్రేమకి పెద్దలు ఒప్పుకోవడం లేదని పారిపోయి తమ ప్రేమ ను బ్రతికించుకుంటున్నారు. అలాగే మరికొంతమంది పెద్దలు ప్రేమని అంగీకరించలేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కులాంతర వివాహాల పై కూడా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా కులాలు మతాలు అంటూ పాకులాడటం వృధా అంటున్నా కూడా ఇంకా కొంతమంది ఆ సంప్రదాయాలకు స్వస్తి పలకలేకున్నారు. ఈ తరుణంలోనే కులాంతర వివాహం పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెళ్లడించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి పెళ్లి కేసులో యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెళ్లడించింది. కోర్టు దృష్టిలో వారు హిందూ ముస్లిం కాదని వారు 18 ఏళ్లు నిండిన మేజర్లు అని వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు స్వేచ్ఛ వారికి ఉంటుంది అని అలాగే అలా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే వారిని ప్రశ్నించే హక్కు వారి కుటుంబ సభ్యులకి లేదని కోర్టు తెలిపింది. 2019 లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వారి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం ప్రియాంకా తన పేరును అలియాగా మార్చుకుంది. వారిద్దరూ తమ తమ కుటుంబాల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. దీనిపై ప్రియాంకా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

అదే సమయంలో యువతి తండ్రి తన కుమార్తెను కలిసే హక్కు కూడా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రియాంకా ఖర్వార్ లేకపోతే అలియా ఎవరైనా కావొచ్చు ఆమె తనకు నచ్చిన వారిని కలిసే స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. మరోవైపు ప్రియాంకా తన కుటుంబం మీద కూడా గౌరవం కలిగి ఉంటుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే పెళ్లి చేసుకోవడానికి మతం మారడాన్ని ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ఇది చెల్లదని వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అది వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here