#నెట్ ఫ్లిక్స్ వివాదం.. గుడిలో దేవుళ్లను అవమానించి లవ్ జిహాదీని ప్రోత్సహించారు!
#నెట్ ఫ్లిక్స్ వివాదం.. గుడిలో దేవుళ్లను అవమానించి లవ్ జిహాదీని ప్రోత్సహించారు!

వరుస వివాదాలతో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పోరాటం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఇంతకుముందు సత్యం రామలింగరాజు జీవితంపై సిరీస్ ని రూపొందించి కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తోంది. తన అనుమతి లేకుండా సిరీస్ తీశారని మనోభావాల్ని కించపరిచారని నెట్ ఫ్లిక్స్ పై రామలింగరాజు ఫ్యామిలీ పోరాటం సాగిస్తోంది. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.

ఇదిలా ఉండగానే `ఏ సూటబుల్ బాయ్` అనే వెబ్ సిరీస్ ద్వారా మత మనోభావాలను దెబ్బతీసినందుకు నెట్ ఫ్లిక్స్ కి చెందిన ఇద్దరు ప్రతినిధులపై మధ్యప్రదేశ్ లో ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఓ ఆలయ ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలను చూపించడమే ఇందుకు కారణమని ఓ అధికారి తెలిపారు. కంటెంట్ (నెట్ఫ్లిక్స్) ఉపాధ్యక్షుడు మోనికా షెర్గిల్.. పబ్లిక్ పాలసీల (నెట్ఫ్లిక్స్) డైరెక్టర్ అంబికా ఖురానా అనే పేర్లను ఎఫ్.ఐఆర్ ప్రకటించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

నెట్ ఫ్లిక్స్ సిరీస్ రూపకర్తల నుండి క్షమాపణ చెప్పాలని.. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ ఇచ్చిన ఫిర్యాదుపై రేవా పోలీసులు అభియోగాలు మోపారు.

నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న `ఏ సూటబుల్ బాయ్` సిరీస్ ను సదరు ఆలయంలో చిత్రీకరించారా ? మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందో లేదో తనిఖీ చేయమని నేను అధికారులను కోరాను. ఈ దృశ్యాలు మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పరీక్షా ప్రైమా ఫేసీ కనుగొంది. ఒక ప్రత్యేక మతంపై విమర్శగా ఉంది అంటూ మిస్టర్ మిశ్రా ఒక వీడియో స్టేట్మెంట్లో చెప్పారు.

“గౌరవ్ తివారీ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నెట్ ఫ్లిక్స్ అధికారులపై రేవాలోని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 295 (ఎ) (మతపరమైన భావాలను నమ్మకాలను రెచ్చగొట్టడం అవమానించడం వంటి హానికరమైన చర్యలు) కింద ఎఫ్ఐ.ఆర్ నమోదు చేశారు. మోనికా షెర్గిల్ – అంబికా ఖురానా దీనికి బాధ్యులు” అని అన్నారాయన. రేవా పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేవామని తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

నెట్ ఫ్లిక్స్ సిరీస్ మేకర్స్ దీనికి క్షమాపణ చెప్పాలని `ఎ సూటిబుల్ బాయ్` నుండి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని కోరుతూ గౌరవ్ తివారీ శనివారం రేవా పోలీసు సూపరింటెండెంట్ కు మెమోరాండం సమర్పించారు.

“మధ్యప్రదేశ్ లోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం మహేశ్వర్ ఆలయం లోపల ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమిది. ఇది లవ్ జిహాద్ ను కూడా ప్రోత్సహిస్తోంది“ అని తివారీ పేర్కొన్నారు. అతను తన ఫిర్యాదు దరఖాస్తులో మోనికా షెర్గిల్ .. అంబికా ఖురానా అని పేర్లు పెట్టారు.

ఆరు భాగాల నెట్ఫ్లిక్స్ సిరీస్ కు ప్రఖ్యాత చిత్రనిర్మాత మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలైన `సలాం బాంబే`..`మాన్ సూన్ వెడ్డింగ్` .. ది నేమ్సేక్ లతో సంచలనాల దర్వకురాలిగా పాపులరయ్యారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here