కేసీఆర్ ప్రకటనతో వకీల్ సాబ్లో కదలిక?
కేసీఆర్ ప్రకటనతో వకీల్ సాబ్లో కదలిక?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్ కు అనుమతులు ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి పలు ఉపయోగదాయక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుండి థియేటర్ల ఓపెన్ కు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పడంతో విడుదల విషయంలో మళ్లీ హడావుడి మొదలయ్యింది. వెంటనే కొత్త సినిమాలు విడుదల కాకున్నా కూడా వచ్చే నెలలో సినిమాల విడుదలకు సిద్దం అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విడుదల విషయమై చర్చలు జరుగుతున్నాయి.

సంక్రాంతి సీజన్ వరకు థియేటర్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు విడుదల విషయంలో ఆసక్తి చూపించలేదు. మార్చి లేదా ఏప్రిల్ లో వకీల్ సాబ్ ను విడుదల చేయాలని భావించారు. కాని థియేటర్ల ఓపెన్ కు అనుమతి వచ్చిన నేపథ్యంలో మరో రెండు నెలల సమయం ఉన్న కారణంగా సినిమాను సంక్రాంతి సీజన్ కు తీసుకు వస్తే బాగుంటుందనే అభిప్రాయంలో దిల్ రాజు అండ్ టీం ఉన్నారట. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మరి కొన్ని రోజుల్లో పూర్తి చేసి డిసెంబర్ పూర్తి వరకు విడుదలకు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నారట. అధికారికంగా విడుదల తేదీ విషయంలో వచ్చే నెలలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here