థియేటర్లలోనే కియారా సినిమా..! స్టార్ హీరోలే భయపడుతున్న వేళ ఇదో సంచలనం
థియేటర్లలోనే కియారా సినిమా..! స్టార్ హీరోలే భయపడుతున్న వేళ ఇదో సంచలనం

కరోనా దెబ్బకు సినిమాలన్నీ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. లాక్డౌన్ తర్వాత చాలాకాలం పాటు థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వాలు లాక్డౌన్కు సడలింపులు ఇచ్చాయి. సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకొనేందుకు కూడా అనుమతిచ్చాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్కు వీలు కల్పించాయి. కానీ జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు జంకుతున్నారు. స్టార్హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. సూర్య నటించిన ‘ఆకాశమే హద్దుగా’ ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. బాలీవుడ్ హీరో అక్షయ్ నటించిన లక్ష్మీబాంబ్ కూడా ఓటీటీలో విడుదలైంది.

ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు భయపడుతున్నారు. కరోనా పూర్తిగా తగ్గిపోయాక విడుదల చేస్తే లాభాలు వస్తాయని ఆశపడుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కియారా అద్వానీ నటించిన ‘ఇందూ కి జవానీ’ అనే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 17న తమ సినిమా థియేటర్ల ముందుకు రాబోతున్నదంటూ ప్రకటన విడుదల చేశారు. పెద్ద పెద్ద హీరోలే థియేటర్లలో సినిమా విడుదలకు భయపడుతున్న వేళ .. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ థియేటర్లలో రిలీజ్ చేయడం నిజంగా సాహసమే.

అయితే అదే రోజు భూమి పడ్నేకర్ నటించిన ‘దుర్గామతి’ అనే మరో లేడీ ఒరియంటెడ్ చిత్రం అమేజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతి చిత్రానికి ఇది రీమేక్గా వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు కేవలం 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నది. ఈ నేపథ్యంలో కియారా సినిమాకు కలెక్షన్లు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here