కాజల్ కిచ్లు హనీమూన్ ఆల్బమ్ లో స్పెషల్ ఫోటో
కాజల్ కిచ్లు హనీమూన్ ఆల్బమ్ లో స్పెషల్ ఫోటో

కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి హనీమూన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో ఈ జంట కాస్ట్ లీయెస్ట్ హనీమూన్ ని ఎంజాయ్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాజల్ కిచ్లు జోడీ సముద్రం అడుగున అండర్ వాటర్ విన్యాసాలతో అదరగొట్టారు. ఈ జంట విన్యాసాలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

ఇప్పటికే హనీమూన్ ముగించి తిరిగి ముంబైకి వచ్చేసింది ఈ జంట. తదుపరి వరుసగా షూటింగ్ లతో కాజల్ బిజీ కానుంది. ప్రస్తుత తీరిక సమయాల్లో మాల్దీవుల విహారానికి సంబంధించిన ఒక్కో ఫోటోని కాజల్ అగర్వాల్ అభిమానుల కోసం రివీల్ చేస్తున్నారు. మాల్దీవుల్లో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇప్పటికీ కాజల్ అవే కలలు కంటున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా కాజల్ తన మాల్దీవుల ఆల్బమ్ నుండి ఓ ఫోటోను ఎంచుకున్నాడు. కాజల్ కు ఇష్టమైన హనీమూన్ ఫోటోలలో ఒకటి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. కాజల్ పూల్ సైడ్ చిల్లింగ్ మూవ్ మెంట్ ని.. నీటిలో తేలియాడే అల్పాహారం సెషన్ ని ఆవిష్కరించే ఫోటో ఇది.

అక్టోబర్ 30 న ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లు జంట వివాహం జరిగింది. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. లాక్ డౌన్ తీరిక సమయంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటైంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here