అక్కినేని హీరో సినిమా అంత బిజినెస్ చేస్తుందా..?
అక్కినేని హీరో సినిమా అంత బిజినెస్ చేస్తుందా..?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”లవ్ స్టోరీ”. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. చైతూ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై స్పష్టత రానుంది.
‘లవ్ స్టోరీ’ చిత్రానికి మేకర్స్ సుమారు 35 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. సినిమా మీద నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టామని ప్రొడక్షన్ టీమ్ చెబుతున్నారట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ‘లవ్ స్టోరీ’ ని థియేటర్ రిలీజ్ చేసి.. అన్నీ రైట్స్ కలిపి 40 కోట్లకు పైగా బిజినెస్ జరిగేలా చూడాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఫిదా’ వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత నాగచైతన్య చేస్తున్న సినిమా కావడంతో ‘లవ్ స్టోరీ’ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here