ప్రభాస్ నిబద్ధతను ఆకాశానికెత్తేసిన వెటరన్
ప్రభాస్ నిబద్ధతను ఆకాశానికెత్తేసిన వెటరన్

డార్లింగ్ ప్రభాస్ ఏం చేసినా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ రాజు ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి సాటి తారలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయనను ఎందుకని డార్లింగ్ అని పిలుస్తారో తమకు ప్రత్యక్షంగా అర్థమవుతోందని మనసు విప్పి మాట్లాడతారు.

ఇంతకుముందు కాజల్.. అనుష్క.. శ్రద్ధా కపూర్..నదియా.. రవీనా టాండన్ సహా పలువురు తారలు ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ లో నటిస్తున్న సీనియర్ నటుడు జయరామ్ కూడా అదే పంథాలో డార్లింగ్ మంచి మనసును నిబద్ధతను పొగిడేశాడు.

ఆయన ఇలా ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించారో లేదో తొలిగా ప్రభాస్ తోనే మొదలు పెట్టారు. ప్రభాస్ పట్టుదల కసి నిబద్ధతను ప్రశంసించడమే గాక.. ప్రభాస్ నిజాయితీ విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. రాధేశ్యామ్ లో ప్రభాస్ తో కలిసి జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని.. హృదయాన్ని తాకుతుందని జయరామ్ అన్నారు. ఆ అరుదైన ప్రేమకథను వీలైనంత త్వరగా పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.

రాధేశ్యామ్ టీమ్ అన్ని భాషల నుంచి ప్రతిభావంతులైన తారల్ని ఎంపిక చేసుకుని పాన్-ఇండియన్ మూవీగా మసాలా దినుసులను జోడించడం ప్రధాన అస్సెట్ కానుంది. కోస్టార్స్ తో ఎంతో మర్యాదగా ప్రవర్తించే ప్రభాస్ వల్ల ప్రతిదీ సులువుగా సాగుతోందట. అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` జయరాం కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here