ఆ విషయంలో కూడా ఏపీనే నెంబర్ వన్?
ఆ విషయంలో కూడా ఏపీనే నెంబర్ వన్?

ఉపాధి హామీ పథకం … పనులు లేక పస్తులు ఉండే వారికోసం తీసుకొచ్చిన అతి పెద్ద ఆపన్న హస్త పథకం. దేశంలో ఈ ఉపాధి హామీ పథకం ఎంతో పేరుగాంచింది. ఇక ఈ ఉపాధి హామీ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. దేశం మొత్తమ్మీద 2019 –20 ఆర్థిక ఏడాదిలో రూ.68300 కోట్లు ఖర్చు జరిగితే ఈ ఏడాది ఇప్పటికి రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం.ఏడాదిలో రెండుసార్లు అడిట్ జరగాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ పనులపై ఒక్కసారి కూడా అడిట్ జరగడంలేదు. అయితే మన రాష్ట్రంలో మాత్రం ప్రతి గ్రామంలో ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఆడిట్ జరుగుతోంది. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులకు ప్రభుత్వం విడుదల చేసే కూలి డబ్బులు.. ఎక్కడా అవినీతికి తావులేకుండా అసలైన లబ్ధిదారులకు చేరాయా లేదా జరిగిన పని నాణ్యతతో చేశారా.. లేదా అన్న అంశాలపై సామాజిక తనిఖీ నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తోలి స్థానంలో నిలిచింది.

అన్ని రాష్ట్రాల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో పలు రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ నిర్వహణపై రాష్ట్రాల వారీగా మార్కులను కేంద్రం ప్రకటించింది. సమావేశానికి ముందు కేంద్రం నిర్దిష్ట పద్ధతిలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకొని ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆయా రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ అమలు ఆధారంగా మార్కులు కేటాయించింది. 2006లో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టినప్పుడు దేశంలో ఎక్కడా సోషల్ ఆడిట్ విభాగాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తొలిసారిగా ఈ విధానానికి నాంది పలికారు.

గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించేందుకు 15856 మంది మహిళలను విలేజ్ రిసోర్స్ పర్సన్లుగా నియమించి వారందరికీ శిక్షణ ఇప్పించారు. గత ప్రభుత్వ హయాంలో 2018–19 ఆర్థిక ఏడాదిలో ఉపాధి పనులు జరిగిన ప్రాంతాల్లో అధికారిక లెక్కల ప్రకారం 80.52 శాతం మాత్రమే సోషల్ ఆడిట్ నిర్వహించగా 2019–20 చివర్లో కరోనా కారణంగా ఇబ్బంది ఏర్పడినా 94.5 శాతం ఆడిట్ పూర్తి చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సోషల్ ఆడిట్ ప్రక్రియను కేవలం ఉపాధి హామీ పథకం అమలుకే పరిమితం చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ వర్తింపజేశారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here