కొవ్వును కరగదీసే వ్యవస్థను చంపేస్తోన్న కరోనా
కొవ్వును కరగదీసే వ్యవస్థను చంపేస్తోన్న కరోనా

కరోనా వైరస్పై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. కరోనా వైరస్ కొత్తది కావడం వల్ల అది మానవశరీరం మీద ఎటువంటి ప్రభావం చూపుతున్నది అన్న విషయంపై రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్నది. కరోనా ఊపిరితిత్తులను దెబ్బ తీస్తున్నదన్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ అందరి శరీరంపైనా ఒకే విధమైన ప్రభావం చూపడం లేదు. వృద్ధులకు కాస్త ఎక్కువ హాని కలిగిస్తుండగా.. రోగ నిరోధకశక్తి ఎక్కువ ఉన్నవాళ్లల్లో యువత చిన్నపిల్లల్లో తక్కువ ప్రభావం చూపిస్తున్నది. అయితే చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పుడో కొత్త విషయాన్ని కని పెట్టారు.

కరోనా వైరస్ శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతున్నదట. ఈ పరిశోధన భవిష్యత్ లో కరోనా చికిత్స లో ఉపయోగ పడుతుందని వాళ్లు చెబుతున్నారు. చైనాకు చెందిన అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. కొవ్వులను ప్రాసెస్ చేసే వ్యవస్థ ను కరోనా వైరస్ దెబ్బ తీస్తుందని వీళ్ల పరిశోధనలో తేలింది. కోవిడ్ చికిత్స కు ఈ పరిశోధన ఎంతో తోడ్పడుతుందని వాళ్లు చెబుతున్నారు.

ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వాక్సిన్ కోసం ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని దేశాల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి. కరోనా మెడిసిన్ పై పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కొవ్వులను ప్రాసెస్ చేసే వ్యవస్థపై కరోనా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని శాస్త్రీయంగా కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. నేచర్ మెటబాలిజం జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్తో కూడిన కణాలను ప్రయోగశాలలో వృద్ధి చేశారు. వీటిని పరిశీలించినప్పుడు శరీరానికి మేలు చేసే హెచ్డీఎల్ కొవ్వులు అతుక్కునే భాగానికే వైరస్ కూడా అతుక్కున్నట్లు గుర్తించారు. ఆ భాగాన్ని తొలగించి పరిశీలిస్తే వైరస్ మానవ కణానికి అతుక్కోవడం నిలిచిపోయింది. ఈ అంశం ఆధారంగా వ్యాధి చికిత్సకు కొత్త మందులు తయారు చేయొచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇంకా ఈ పరిశోధన ప్రారంభదశలో ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాల్సి ఉన్నదని వాళ్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here