ఫోటో స్టోరి: వైట్ అండ్ వైట్ లో ప్రగ్య సంథింగ్ హాట్
ఫోటో స్టోరి: వైట్ అండ్ వైట్ లో ప్రగ్య సంథింగ్ హాట్

ఇన్ స్టా హాటెస్ట్ బ్యూటీగా పాపులరవుతోంది ప్రగ్య జైశ్వాల్. దిశాపటానీ- రకుల్ ప్రీత్ – అదా శర్మ లాంటి యాక్టివ్ హీరోయిన్లకు ధీటుగా ప్రగ్య తనని తాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్న తీరు ఇటీవల చర్చకు వచ్చింది. సినీ ఆఫర్లతో పని లేకుండా కమర్షియల్ ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్న నటిగా గుర్తింపు దక్కించుకుంది.

రెగ్యులర్ గా జిమ్ వర్కవుట్ వీడియోల్ని యోగా ఫీట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది ప్రగ్య. ఇవన్నీ అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక వేడెక్కించే ఫోటోషూట్లకు అయితే కొదవే లేదు.

ప్రగ్య జైశ్వాల్ తాజా ఫోటోషూట్ ఫ్యాన్స్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ లుక్ సంథింగ్ స్పెషల్. ప్రగ్యలోని మరో కొత్త యాంగిల్ ని ఎలివేట్ చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వైట్ అండ్ వైట్ డిజైనర్ ఇన్నర్ పై వైట్ ఊల్ కోట్ ధరించి హాటెస్ట్ స్టార్ గా తనని తాను ఎలివేట్ చేసుకుంది ప్రగ్య. ఈ భామకు ఇటీవల తెలుగులో ఓ అగ్ర హీరో ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. కానీ దేనికీ అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here