బికినీ పెదవి ముద్దులు ఇష్టం లేకపోయినా!
బికినీ పెదవి ముద్దులు ఇష్టం లేకపోయినా!

బికినీ వేయడం.. బెడ్ రూమ్ సన్నివేశాల్లో చెలరేగిపోవడం .. పెదవి ముద్దులతో హీటెక్కించడం .. ఇవన్నీ కథానాయికలకు అలవాటు వ్యాపకమా? అంటే కానే కాదని అనేసింది త్రిధా చౌదరి. ఈ క్యూట్ బ్యూటీ `సూర్య వర్సెస్ సూర్య` లో నిఖిల్ సరసన నటించింది. ఆరంగేట్రం ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించినా గ్లామర్ రంగానికి ఏది అవసరమో దానిని అందించేందుకు పరితపిస్తోంది. ఇటీవల గ్లామర్ ఎలివేషన్ ఉన్న పాత్రల్లో నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటోంది.

బికినీకి పెదవి ముద్దులకు నిరభ్యంతరంగా సై అనేస్తోంది త్రిష సిస్టర్ లా కనిపించే త్రిధా. అయితే ఇవన్నీ మీకు ఇష్టమా? అని ప్రశ్నిస్తే మాత్రం అసలు అవేవీ తనకు సౌకర్యంగా ఉండవని చెప్పేసిన త్రిధ కేవలం ఇలాంటివన్నీ వృత్తిలో భాగం అంటూ సరిపెట్టుకుంటుందట.

నటన ప్రతిభతోనే ఈ అమ్మడు ఇక్కడ నెట్టుకొస్తోంది. కాస్త పట్టు విడుపు ప్రదర్శించి వరస అవకాశాలు అందుకుంటోంది. స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం హాట్ గా కనిపించడానికి సిద్ధమేనని త్రిధ తెలిపింది. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలతో బిజీగా ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here