బీచ్ వెకేషన్ లో వేదిక అన్ లిమిటెడ్ ట్రీట్
బీచ్ వెకేషన్ లో వేదిక అన్ లిమిటెడ్ ట్రీట్

బాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత నటసింహా సరసన రూలర్ లో అవకాశం అందుకుంది వేదిక. అయితే ఈ కుర్రబ్యూటీకి టాలీవుడ్ లో ఆశించినంత పెద్ద కెరీర్ దక్కలేదు. ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. అప్పట్లో మునిలో రాఘవ లారెన్స్ సరసన ఆడిపాడింది. కానీ అది కూడా ప్రయోజనం కలిగించలేదు.

వేదిక 2019లో ది బాడీ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించింది. ఇందులో హిమేష్ రేషమ్మియా.. రిషీ కపూర్.. శోభిత ధూళిపాల తదితరులు నటించారు. ఆ తర్వాత సరైన ఆఫర్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం సౌత్ లో మరోసారి కెరీర్ పరంగా వెలిగిపోయేందుకు వేదిక తపిస్తోంది.

ఆ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే వేదిక బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో మంట పెడుతున్నాయి. తాజాగా బీచ్ వెకేషన్ లో వేదిక విరహగీతం వైరల్ గా మారింది. లేటెస్ట్ హాట్ బికినీ ఫోటోలు బోల్డ్ యాక్ట్ గురించి ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. అంత సాంప్రదాయ బద్ధంగా కనిపించిన వేదిక ఇంతగా చెలరేగుతుందని అనుకోలేదు! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here