తెలుగు బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ హోస్ట్
తెలుగు బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ హోస్ట్

తెలుగు బిగ్ బాస్ ఆదివారి ప్రత్యేక గెస్ట్ గా కన్నడ స్టార్ నటుడు సుదీప్ కనిపించబోతున్నాడు. నిన్ననే షూటింగ్ లో నాగ్ తో కలిసి సుదీప్ పాల్గొన్నాడు. సుదీప్ చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేయించడంతో పాటు త్వరలో కన్నడంలో తాను ప్రారంభించబోతున్న బిగ్ బాస్ కు సంబంధించిన విషయాన్ని కూడా సుదీప్ షేర్ చేసుకుంటాడు అంటూ మా వర్గాల ద్వారా తెలుస్తోంది. సుదీప్ ను బిగ్ బాస్ స్టేజ్ పై చూడనుండటంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. సుదీప్ ను స్టేజ్ పూ చూడగానే కంటెస్టెంట్స్ షాక్ అయ్యే అవకాశం ఉంది.

కన్నడంలో బిగ్ బాస్ ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ ఈ ఏడాది ఉంటుందో లేదో అని అంతా అనుకున్నారు. తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అవ్వడంతో అక్కడ నుండి తమిళ మరియు హిందీ బిగ్ బాస్ లు ప్రారంభం అయ్యాయి. కాని కన్నడ బిగ్ బాస్ మాత్రం షురూ అవ్వలేదు. వచ్చే ఏడాది ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సుదీప్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన సుదీప్ హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రావడంతో నాగార్జున ఆహ్వానం మేరకు తెలుగు బిగ్ బాస్ స్టేజ్ పై కొద్ది సమయం కనిపించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here