ఎన్టీఆర్ తో కేజీఎఫ్ కథ ఇదేనా?
ఎన్టీఆర్ తో కేజీఎఫ్ కథ ఇదేనా?

 

కేజీఎఫ్ తో ఒక్కసారిగా జాతీయ స్థాయి స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ అతి త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా మరింత హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అంతకు మించి అన్న రీతిలో ఉంటుంది అంటూ కన్నడ సినిమా పరిశ్రమ వర్గాల వారు అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ అనేది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా కేజీఎఫ్ 2 అంటూ అంచనాలు భారీగా పెంచాడు. ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈయన ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక కన్నడ సినీ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించిన నేపథ్యం మరియు కథ కూడా క్లుప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సమయంలో జరిగిన సంఘటనలు మరియు ఇండో పాక్ యుద్దం వంటి పరిణామాలను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. స్టోరీ లైన్ ఇప్పటికే సిద్దం అయ్యింది. స్క్రిప్ట్ వర్క్ ను ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 విడుదల తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here