ఫోటో స్టోరి: పెళ్లయినా అదే రెబలిజం!
ఫోటో స్టోరి: పెళ్లయినా అదే రెబలిజం!

ఆఫ్టర్ మ్యారేజ్.. బిఫోర్ మ్యారేజ్.. సరిహద్దులు చెరిగిపోతున్నాయా? స్త్రీ సమానత్వం అనేది నేటితరంపై బలమైన ప్రభావం చూపిస్తోందా? ఇదంతా నిరంతరం సాంప్రదాయవాదుల్లో నలిగే ఆసక్తికర చర్చ. పబ్లిక్ లో ఆడవారి దుస్తులపై కామెంట్లు చేసి ఎరక్కపోయి చీవాట్లు తిన్న పురుష పుంగవులకు కొదవేమీ లేదు. కామెంట్లు చేసి పలువురు మేల్ స్టార్లు.. రాజకీయ నాయకులు కూడా బుక్కయ్యారు.

అదంతా సరే కానీ .. పెళ్లయ్యాకా రెబలిజం తనలో ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ తాజాగా దీపిక పదుకొణే పబ్లిక్ లో ప్రత్యక్షమైన తీరు.. ఆ వస్త్రధారణ యూత్ లో చర్చకు వచ్చింది. చినుగులతో ఉన్న డెనిమ్ షార్ట్ లో ఇదిగో ఇలా పబ్లిక్ లో అవతరించడంతో ఈ ఫోటోని అంతే జోరుగా వైరల్ చేస్తున్నారు.

చినుగుల డెనిమ్ నిక్కరు.. బ్లాక్ టాప్ తో దీపిక టాప్ లేపేసింది. రణవీరుడిని పెళ్లాడాకా ఈ భామలో ఎలాంటి మార్పు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక లేటెస్టుగా మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ డీపీని సోషల్ మీడియాల్లో పెట్టుకుని మరోసారి చర్చల్లోకి వచ్చింది. రణబీర్ – దీపిక జంటగా నటించిన `తమాషా` పోస్టర్ ని డీపీగా పెట్టుకున్నారు దీపిక. తమాషా రిలీజై ఐదేళ్లయిన సందర్భంగా అలా చేసింది. ప్రస్తుతం దీనిపై ట్రెండీగా చర్చ సాగుతోంది. ఈలోగానే ఇదిగో ఇలా ప్రత్యక్షమై హీటెక్కించింది. ఇటీవల డ్రగ్స్ కేసులోనూ ఎన్.సి.బి దీపికను ప్రశ్నించిన సంగతి తెలిసినదే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here