ఫోటో స్టోరి: స్టైలిష్ వరుడిగా శౌర్య మేకోవర్
ఫోటో స్టోరి: స్టైలిష్ వరుడిగా శౌర్య మేకోవర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగశౌర్య కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని- శర్వానంద్ లా జయాపజయాలతో పని లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళుతున్నాడు ఈ యంగ్ హీరో.

ఇటీవల గడ్డం కోరమీసాలతో కనిపించాడు. భారీగా కండలు పెంచేందుకు జిమ్ముల్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న ఫోటోల్ని షేర్ చేశాడు. ఇదంతా దేనికోసం? అంటే అతడు నటిస్తున్న తాజా చిత్రాల కోసమేనట.

ప్రస్తుతం `వరుడు కావలెను` అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. షూటింగ్ హడావుడిలో విమానాశ్రయాల్లో నే ఎక్కువ కనిపిస్తున్నాడు. లేటెస్టుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రాకుమారుడిలా ప్రత్యక్షమయ్యాడు. శౌర్య మేకోవర్ ఎంతో స్టైలిష్ గా ఆకట్టుకుంది. దుబాయ్ లో షూటింగ్ కి బయల్దేరాడట. ఈ చిత్రంలో రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసి దుబాయ్ షెడ్యూల్ ని చిత్రబృందం ప్లాన్ చేసింది. యాథృచ్ఛికమే అయినా కాబోయే వరుడు నాగశౌర్య అనే అర్థమవుతోంది. ఈ స్టైలిష్ మేకోవర్ ఆ పాత్ర కోసమే అనుకోవచ్చు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here