ప్రముఖ యాంకర్ వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ వీడియో వైరల్

ఎప్పుడూ వివాదాస్పద అంశాల వైపు పోనీ ప్రముఖ యాంకర్లు తాజాగా పాలిటిక్స్ ప్రజలు అంటూ సంఘ సేవ వైపు చూస్తున్నారు. ఇటీవలే యాంకర్ సుమ సైతం కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేసి ట్రోల్స్ కు గురయ్యారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రముఖ యాంకర్ ఉదయభాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది.

తెలుగులో టాప్ యాంకర్లలో ఉదయభాను ఒకరు. సుమ ఝాన్సీ తర్వాత ఉదయభానుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఓటుహక్కు ప్రాధాన్యం గురించి ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సామాజిక పరిస్థితులను కళ్లకు కడుతూ చక్కటి తెలుగులో ఆకట్టుకునేలా చెప్పుకొచ్చారు.

జీవితం ఒక యుద్ధమైతే దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు అని.. దాన్ని నిర్వీర్యం చేయవద్దని.. ఖచ్చితంగా ఓటు వేసి ప్రశ్నించే హక్కు పొందాలని ఉదయభాను సూచించారు. ప్రలోభాల కోసం కాదు.. ప్రగతి కోసం ఓటేద్దామని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ ఉదయభాను స్ఫూర్తిదాయక పిలుపునిచ్చారు.

మహానేతలంతా మహాద్భుతంగా మాట్లాడుతున్నారని.. మీడియా వారిది.. ఎవరి మాధ్యమాలు వారివని.. మాటల గారడీ అంకెల గారడీతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని.. ఏది నిజమో తెలుసుకొని.. మన జీవితాలకు స్థితిగతులు చూసి మనస్షాక్షిగా ఓటేయాలని ఉదయభాను పిలుపునిచ్చారు.

ఓటును అమ్ముకోవద్దని సరైన పాలకులను ఎన్నుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఉదయభాను ఆకాంక్షించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here