ట్రెండీ టాక్: స్టైలిష్ స్టార్ బిగ్ గోల్స్
ట్రెండీ టాక్: స్టైలిష్ స్టార్ బిగ్ గోల్స్

ఓవైపు సినిమాలు .. మరోవైపు ఓటీటీ సిరీస్ ల నిర్మాణం.. ఇంకోవైపు మల్టీప్లెక్స్ లు.. స్టూడియోల నిర్మాణం.. వీటికి తోడు ఆహా బ్రాండ్ ప్రమోషన్ .. కమర్షియల్ ప్రకటనలు.. ఇవన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోల్స్. చూస్తుంటే ఈ లైనప్ పెద్ద రేంజులోనే కనిపిస్తోంది.

హీరోగా నిర్మాతగా .. స్టూడియోస్ మల్టీప్లెక్స్ ల వోనర్ గా బన్ని చక్రం తిప్పేందుకు పకడ్భంధీ వ్యూహాలతో ముందుకెళుతున్నారని సమాచారం. ఇటీవలే ఆహా ఓటీటీ కోసం సిరీస్ ల నిర్మాణానికి బన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అలాగే బన్ని కుటుంబం హైదరాబాద్ లో భారీ స్టూడియో నిర్మిస్తున్నారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో భారీ మల్టీప్లెక్స్ ను బన్ని ఏఏ బ్రాండ్ తోనే నిర్మిస్తున్నారు. ఏఏ బ్రాండ్ ని ఇప్పటినుంచే బన్ని ప్రతిచోటా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

బన్నీ ప్రస్తుతం తన స్టార్ డమ్ ని ఇరుగు పొరుగు భాషలకు విస్తరించే యోచనలో ఉన్నాడు. వరుసగా పాన్-ఇండియా సినిమాలతో పోటీబరిలో దిగుతున్నాడు. కెరీర్ పరంగా పెద్ద ఎత్తున దూసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం ప్రతి విభాగాన్ని సక్రమంగా పని చేసేలా చూసుకుంటున్నారు. అతను ప్రతిదీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతిదానికి ఖచ్చితమైన ప్రణాళిక ఫిక్సవుతోంది.

ఇతర స్టార్లతో పోలిస్తే బన్ని ఒక ప్రత్యేక వ్యాపార ధృక్పథంతో ముందుకు సాగుతున్నాడు. అతని బ్యానర్ వేర్వేరు ప్రాజెక్టులను రూపొందిస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా సొంత వ్యాపారాలను ప్రారంభించే వీలుంటుందని తెలుస్తోంది. తదనుగుణంగా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నాడు. రానున్న రోజుల్లో అతడిని మరింత విలక్షణంగా చూసే వీలుంది. ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వం లో తాజా చిత్రం పుష్పతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత భారీ పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here