రకుల్ థియేట్రికల్ ట్రీట్ లేనట్లే!
రకుల్ థియేట్రికల్ ట్రీట్ లేనట్లే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా వెలుగు వెలిగి ఒక్కసారిగా డల్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది ఈమె కెరీర్ పరంగా చాలా ఎత్తు పల్లాలను చవి చూడాల్సి వచ్చింది. అవకాశాలు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు మూడు వరుస సినిమాలు వచ్చాయి. రెండు తెలుగులో ఒకటి హిందీలో ఈమె నటిస్తుంది. అయితే ఈ మూడు కూడా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో ఈమె అర్జున్ కపూర్ తో కలిసి ఒక సినిమాను చేస్తోంది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన ఆ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మరో తెలుగు సినిమా కూడా ఓటీటీ ద్వారానే విడుదల అయ్య అవకాశం కనిపిస్తుంది. అదే నితిన్ తో ఈమె నటిస్తున్న ‘చెక్’. ఈ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. చెక్ లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయట.

మీడియం బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నారని.. నితిన్ కూడా అందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇంకా క్రిష్ కాంబో మూవీ కూడా ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. రకుల్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదల కాబోతున్న కారణంగా ఆమె థియేట్రికల్ ట్రీట్ లేదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here