పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ.. మరో నటుడితో లవ్వాట! షాకిస్తున్న నటి తీరు
పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ.. మరో నటుడితో లవ్వాట! షాకిస్తున్న నటి తీరు

ఊహకు అందని దారుణాల్ని చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మానవ సంబంధాల మీద అనుమానం వచ్చే ఉదంతాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సంచలనంగా మారింది. ఒక బుల్లితెర నటి తనకు పెళ్లైన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పటం ఒక ఎత్తు అయితే.. భర్తతో ఉంటూనే మరో నటుడితో ప్రేమాయణం జరుపుతున్న వైనంపై ఓపెన్ అయ్యారు ఆమె భర్త. అదే సమయంలో ప్రస్తుతం ప్రేమాయణంలో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నటుడు సైతం ఓపెన్ అయి.. ఆ నటి పెళ్లైన షాకింగ్ నిజం తనకు తెలిసిందన్నారు.

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ప్రముఖ టీవీ నటి పవిత్ర పునియా తెలుసు కదా. అనేక సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో నటించిన ఆమె సుపరిచితమే. లవ్ యు జిందగీ తో కెరీర్ షురూ చేసిన ఆమె.. అనేక సీరియల్స్ లో నటిస్తున్నారు. ఒకసారి ఇంటర్వ్యూలో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిన క్యాన్సిల్ అయినట్లు చెప్పారు. అయితే..ఆమెకు పెళ్లైందని.. ఆ విషయం ఎవరితో చెప్పొద్దని తనకు చెప్పినట్లుగా హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరి చెబుతున్నారు. పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని ఆమె కోరినట్లుగా చెప్పిన అతడు.. తాజాగా ఆమె మరో నటుడు పరాస్ ఛబ్రాను కూడా మోసం చేశారని చెబుతూ సంచలన విషయాల్ని వెల్లడించారు.

తాము ఇప్పటికి భార్యభర్తలమేనని.. ఆ విషయాన్ని పవిత్ర తనను చెప్పనివ్వలేదన్నారు. ‘‘నా భార్యగా ఉంటూనే నటుడు పరాస్ ను ప్రేమించింది. వీరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత అతడికి మెసేజ్ చేశా. పవిత్రతో ప్రేమను కొనసాగించొచ్చని.. కాకుంటే విడాకులు వచ్చే వరకు ఆగాలని కోరా. మా ఇంట్లో వారు ఈ విషయం గురించి తెలుసు. ఇప్పటికి పవిత్ర టాటూ నా చేతి మీదే ఉంది. ఆమె పూర్తిగా మారిపోయింది’’ అని పేర్కొన్నారు.

ఆమెలో మార్పు వచ్చినా తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్న అతడు.. ‘‘తొలుత పరాస్ తో అమె అతి చనువుగా ఉందని తెలిసి షాక్ అయ్యా. మా పెళ్లి యానివర్సరీకి గోవాలోని ఏ హోటల్ కు వెళ్లి ఉన్నామో.. అదే హోటల్లో పవిత్ర.. పరాస్ కూడా ఉన్నారని తెలిసి జీర్ణించుకోలేకపోయా. నా భార్య వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఆమె ప్రేమలో నిజాయితీ లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. నటి పవిత్ర తాజా ప్రేమికుడిగా చెబుతున్న పరాస్ సైతం ఈ ఉదంతంపై స్పందించారు. పవిత్ర భర్త మెసేజ్ చేయటం వల్ల నిజం తెలుసుకున్నానని.. ఆమెను అడిగితే.. అది నిజమని చెప్పినట్లుగా చెప్పారు. ‘‘ఆమె గురించి నాకో షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని బయటకు చెప్పను’’ అంటూ వెల్లడించిన పరాస్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here