నిలబడటానికి ట్రై చేస్తున్న సెకండ్ జెనరేషన్ హీరోలు..!
నిలబడటానికి ట్రై చేస్తున్న సెకండ్ జెనరేషన్ హీరోలు..!

టాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో అనేక మంది హీరోలుగా ఇంట్రడ్యూస్ అయ్యారు. సినిమా బ్యాగ్రౌండ్ అనేది మొదటి సినిమాకి మాత్రమే పనికొస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. తర్వాతి రోజుల్లో తమను తాము నిరూపించుకోకపోతే సినిమాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెకండ్ జెనరేషన్ హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ట్రై చేస్తున్నారు. అక్కినేని అఖిల్ – అల్లు శిరీష్ – సుధీర్ బాబు – కళ్యాణ్ దేవ్ – ఆనంద్ దేవరకొండ – బెల్లకొండ సాయి – పంజా వైష్ణవ్ తేజ్.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరంతా ఆల్రేడీ తమ సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవారే. కాకపోతే ఇండస్ట్రీలో సొంత అన్నదమ్ములతో బావమరుదులతో పోటీపడుతూ రేస్ లో సెకండ్ ప్లేసుల్లోనే ఉండిపోతున్నారు. వీరికంటే ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు మాత్రం ముందే ఉంటున్నారు.

అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్.. సాలిడ్ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఒకవైపు తన తండ్రి కింగ్ నాగార్జున మరోవైపు అన్న నాగచైతన్య వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు సురేందర్ రెడ్డి #అఖిల్5 సినిమాలు సక్సెస్ అయితే అఖిల్ కెరీర్ గాడిలో పడే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీ హీరోగా అల్లు అర్జున్ తమ్ముడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంత ట్రై చేస్తున్నా ట్రాక్ లోకి ఎక్కలేకపోతున్నాడు. బన్నీ నీడలో అసలు కనిపించకుండా పోతున్నాడు. ఇక మహేష్ బాబు బావగా కృష్ణ అల్లుడిగా పరిచాయమయ్యాడు సుధీర్ బాబు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో మంచి హిట్స్ వచ్చినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం సుధీర్ నుంచి సూపర్ స్టార్ ఫ్యామిలీ రేంజ్ హిట్ కోరుకుంటున్నారు.

చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ దేవ్ కూడా కష్టపడుతున్నాడు. మొదటి సినిమా ప్లాప్ అవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నాడు. యూట్యూబ్ రిలీజ్ అయిన హిందీ డబ్బింగ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే రెండో చిత్రాన్ని కూడా రెడీ చేశాడు. అలానే విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. థర్డ్ సినిమాని కూడా రెడీ చేస్తూ అన్న నీడలో నిలబడటానికి ట్రై చేస్తున్నాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here