అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అఖిల్ కు ఈ సినిమాతో మొదటి కమర్షియల్ బ్రేక్ రాబోతుందని యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో పూరి ‘మెహబూబా’ ఫేం నేహా శెట్టి కనిపించబోతుంది.

తెలుగు ప్రేక్షకులకు మెహబూబా నేహా శెట్టి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోక పోవడంతో మెయిన్ లీడ్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. ఈ సమయంలో ఈమెకు అఖిల్ మూవీలో వచ్చిన ఆఫర్ తో టాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. అఖిల్ మరియు ఈమెకు మద్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇంతకు ముందే ఈమె బ్యాచిలర్ షూటింగ్ లో పాల్గొంది. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్ లో మరోసారి నేహా శెట్టి నటించింది. ఈ సినిమాపై అమ్మడు చాలా నమ్మకం పెట్టుకుని ఉంది. మరి ఆమెకు బ్యాచిలర్ ఏమైనా సక్సెస్ ఇచ్చేనా చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here