ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మహిళా వాలంటీర్ వెంటపడ్డాడు. పెళ్లి పేరుతో నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. దానితో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం తెలియడంతో ఆమెని దూరం పెట్టడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రియురాలు ప్రియుడిని దాటవేస్తూ వచ్చాడు. అయితే ఏడు నెలల గర్భంతో ఉన్న ఆమె నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించి మృత్యువాత పడింది. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి పొతే ….రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ గాంధీనగరానికి చెందిన యువతి వాలంటీర్ గా పనిచేస్తోంది. సమీపంలోని శాంతిపురం మండలం వడగాండ్లపల్లె కి చెందిన యువకుడు తరచూ గాంధీనగర్ లోని వారి బంధువుల ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో వాలంటీర్ గా పనిచేస్తున్న యువతితో పరిచయం ప్రేమకు దారితీసింది. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా ఆమె గర్భం దాల్చిందని తెలియడంతో దూరంగా పెట్టడం ప్రారంభించాడు.

దీనితో ఈ విషయాన్ని గ్రహించి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని ప్రియురాలు నీలదీస్తే సాకులు చెప్పి దాటవేస్తూ వస్తున్నాడు. అప్పటికే ఏడు నెలల గర్భంతో ఉన్న వాలంటీర్ కి సడెన్ గా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించిన వాలంటీర్ ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచేసింది. తన కూతురిని మోసం చేసి ఆమె మరణానికి కారణమయ్యాడంటూ మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Shocking-incident-in-Andhra-Pradesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here