ఆరంభం కథానాయికగా పరిచయమైనా కాలక్రమంలో పోటీప్రపంచంలో వెనకబడింది శ్రద్ధా దాస్. ఛాన్సుల్లేక అప్పట్లోనే `ఆర్య2`లో వ్యాంప్ తరహా పాత్రలో నటించింది. అటుపై క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పని చేసింది కొన్నిటిలో. మల్టీస్టారర్లలో చిన్న పాత్రలైనా అంగీకరించింది. ఐటెం నంబర్లను అస్సలు విడిచిపెట్టలేదు.
కారణం ఏదైనా శ్రద్ధా తన రేంజుకు తగ్గ అవకాశాలేవీ రాలేదన్న మీమాంశలోనే ఉండిపోయింది. ఇప్పటికీ టాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది. కానీ ఎవరూ పిలిచి అవకాశం ఇచ్చిందేమీ లేదు.
ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియాల్లో హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ టాలీవుడ్ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోంది. తాజాగా శ్రద్ధా షేర్ చేసిన ఫోటో చూసి ఆ నడుము చుట్టు కొలత తగ్గాలి ప్లీజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు బోయ్స్. మరి శ్రద్దా బెల్లీపైనా శ్రద్ధ పెడుతుందేమో చూడాలి.
కెరీర్ మ్యాటర్ చూస్తే.. గుంటూర్ టాకీస్ లాంటి క్రేజీ సినిమాలో ఆఫర్ కోసం ట్రై చేస్తోందట. ఇక అటు హిందీ చిత్రసీమలోనూ ఆఫర్లు లేవు. వెబ్ సిరీస్ లలో ఛాన్సొచ్చినా నటించేందుకు సిద్ధమవుతోందట. తెలుగులో నిరీక్షణ.. కన్నడలో కోటిగొబ్బ 3 అనే సినిమాల్లో నటిస్తున్నా ఇవన్నీ మహమ్మారీ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.