Manchu-Vishnu-Twin-Daughters-Birthday-Celebrations-Goes-Viral
Manchu-Vishnu-Twin-Daughters-Birthday-Celebrations-Goes-Viral

టాలీవుడ్ యువహీరో మంచు విష్ణు – విరోనిక దంపతులకు నలుగురు వారసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆరియానా- వివియానా ట్విన్ డాటర్స్ తో పాటు అవ్ రామ్ అనే చిన్నారి బాలుడు.. బేబి ఐరా కూడా ఉన్నారు.

డిసెంబర్ 2న ట్విన్ డాటర్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకల్ని కుటుంబీకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. విష్ణు- విరోనిక- మంచు లక్ష్మీ తదితరులు సోషల్ మీడియా వేదికగా వారికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విష్ణు స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసిన బర్త్ డే వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

విష్ణు కెరీర్ సంగతి చూస్తే.. ప్రస్తుతం మోసగాళ్లు అనే క్రేజీ మూవీలో నటిస్తున్నారు. అమెరికాలో ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. విష్ణుతో పాటు కాజల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ సహా తెలుగు లోకల్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here