యుద్ధ సైనికుడు దుల్కర్ సరసన బుట్టబొమ్మ
యుద్ధ సైనికుడు దుల్కర్ సరసన బుట్టబొమ్మ

అల వైకుంఠపురములో` మూవీతో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇదే ఊత్సాహంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అంతా పారితోషికాలు తగ్గిస్తుంటే పూజా హెగ్డే మాత్రం అమాంతం పెంచేస్తోంది. 2.5 ఇస్తేనే సినిమా అంటూ కండీషన్ పెడుతోందిట.

అయినా సరే సౌత్ లో ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా పూజా భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నా ఆమే కావాలంటూ ప్రొడ్యూసర్ స్వప్నాదత్ వెంటపడి మరీ ఓకే చేయించుకున్నారట. హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్నాదత్ ఓ వార్ బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ పిరియాడిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అంటూ ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. లెఫ్టినెంట్ రామ్ అనే ఓ యుద్ధ సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ పిరియాడికల్ డ్రామాగా రూపొందబోతోంది.

ఇందులో ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారు. ముందుగా ఈ మూవీ కోసం పూజా హెగ్డేని ఫైనల్ చేశారు. ఇందు కోసం పూజ 2.5 క్రోర్స్ డిమాండ్ చేసిందట. అయితే స్వప్నాదత్ మాత్రం కొంత తగ్గించాలని రిక్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. మరో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు. రష్మిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా అన్నది తెలియాల్సి వుంది. ఈ మూవీని జనవరి నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here